రావికమతం మండలంలోని గుడ్డిప గ్రామంలో శుక్రవారం ఉదయం ఎంపీటీసీ నిధుల ద్వారా కోరుకొండ పాకల దగ్గర, గుడ్డిప కొత్తూరు స్మశాన వాటిక సమీపంలో నూతనంగా 2 బోర్ డ్రిల్లింగ్ లను ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు వేసవిలో త్రాగు నీళ్ల సమస్యలు రాకుండా చూడాలని కోరారు. ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని నూతన బోర్లను వేయడం జరిగిందన్నారు.