రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన 3 లక్షల గృహాలు మే నెలాఖరుకు పూర్తవుతాయని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు చెప్పారు. మంగళవారం వడ్డాదిలో ఏర్పాటుచేసిన చోడవరం నియోజకవర్గ పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు సీఎం చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో కలిసి గృహప్రవేశాలు చేస్తారన్నారు.