బుచ్చయ్యపేట: పంపిణీకి సిద్ధంగా వరి విత్తనాలు

56చూసినవారు
బుచ్చయ్యపేట: పంపిణీకి సిద్ధంగా వరి విత్తనాలు
రైతులకు అవసరమైన వరి విత్తనాలను పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు బుచ్చయ్యపేట మండల వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ రావు తెలిపారు. 1000 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 700 క్వింటాళ్ల అర్జీఎల్ విత్తనాలు, 300 క్వింటాళ్ల, బీపీటీ 5204, స్వర్ణ 1064, ఎంటియు 1318, ఎంటియు 1224, ఎంటియు 1262 రకాల విత్తనాలు పంపిణీకి సిద్ధం చేసామన్నారు.

సంబంధిత పోస్ట్