చీడికాడ మండలం అడవి అగ్రహరం గ్రామానికి చెందిన దాలిబోయిన ధనలక్ష్మి అనే విద్యార్ధిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 979 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంతటి ఘనత సాధించిన ధనలక్ష్మికి గ్రామ ప్రజలు, తల్లి తండ్రులు నాగరాజు, లక్ష్మీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ గ్రూప్ 1 ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని తెలిపారు.