చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం యానివల్ డే, ఫేర్వెల్ దినోత్సవ వేడుకలు ఘనగ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్ కుమార్, చోడవరం ఎస్సై నాగ కార్తీక్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. కళాశాల పూర్వ విద్యార్థులు బాలికల కోసం నిర్మించిన టాయిలెట్స్ శ్రీనివాస్ గుప్తా, గౌరీ శంకర్ మాస్టారు, దేవుడు మాస్టారు ప్రారంభించారు.