రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు బుధవారం చోడవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు మల్లు నాయుడు, పెదబాబు పలువురు నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.