దేశంలోని కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనాలు, ముటా, ఆటో కార్మికుల కు సమగ్ర చట్టం , వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు తదితర డిమాండ్లతో మే 20న జరగనున్న సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి వి వి శ్రీనివాసరావు, ఎస్. వి నాయుడు లు పిలుపునిచ్చారు. గురువారం చోడవరంలో కళాసీలతో జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు.