చోడవరం లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చోడవరంతో పాటు మండలంలో గల వెంకన్నపాలెం. అంబేరపురం రహదారులు చెరువును తలపించే విధంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఇది అనకాపల్లి చోడవరం వెళ్లే ప్రధాన రహదారి కావడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యంగా కొత్తగా ప్రయాణం చేసేవారు అక్కడ గొయ్యి ఉందో లేదో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలా భయంతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.