రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపుచర్యలకు పూనుకుంటుందని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. ఈనెల 1వ తేదీన దిబ్బిడి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా కూటమి నాయకులు ప్రేరేపించి వైసిపి వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం వారి నైజానికి నిదర్శనం అన్నారు. శుక్రవారం అరెస్టై బెయిల్ పై విడుదలైన వారిఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.