చోడవరం: తాగునీటి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మాలుగు సదుపాయాలు కల్పనకు, ముఖ్యంగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు చెప్పారు. బుధవారం చోడవరం అన్నవరం వీధిలో నూతనంగా నిర్మించిన ఇంటింటి కుళాయిలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఇంటికి త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు