జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో 10వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రం స్టడీ అవర్ నిర్వహించుచున్నారు. విద్యార్థుల హాజరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10వతరగతి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని, అత్యధిక మార్కులతో పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు.