ముఖ్యమంత్రి చంద్రబాబు తోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం చోడవరం మండలం బెన్నవోలు జన్నవరం జి కొత్తూరు తిమ్మన పాలెం చాకిపల్లి రామ జోగిపాలెం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు.