చోడవరంలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథోత్సవాల్లో భాగంగా, 8వ రోజు శనివారం స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనేకమంది భక్తులు జగన్నాధ వెంకటేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జూలై 7వ ఆతేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారు రోజుకొ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.