మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం చోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశాఖలో ఈ నెల 21న జరగనున్న యోగ దినోత్సవం నిర్వహణకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగ కార్యక్రమం వివరాలు తెలియజేశారు.