ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందిస్తోన్న సీఎం సహాయనిది చెక్కులను సద్వినియోగపరచుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం చోడవరం పార్టీ కార్యాలయంలో ఆయన చోడవరం నియోజవర్గంలో గల 29 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. వీటిని సద్ది వినాయక పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.