సీఎం చంద్రబాబు ఆదేశాలతో అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎమ్మెల్యే కె ఎస్ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో అమరావతి మహిళలపై అసభ్య పదజాలంతో సాక్షి ఛానల్ లో దూషించిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్ భారతి, కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూతహసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.