చోడవరం: నాటుసారా, మద్యం బాటిల్స్, నల్లబెల్లం ధ్వంసం

70చూసినవారు
విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు అనకాపల్లి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ టి. రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం చోడవరం ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ కెవి పాపునాయుడు మధ్యవర్తుల సమక్షంలో 3329 కేజీల నల్ల బెల్లం, 85.89 లీటర్ల నాటు సారాయి, 305 మద్యం బాటిల్స్, 7 బీర్ బాటిల్స్ ను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ హనుమంతు, వారి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్