నాటు సారా కలిగి ఉన్న ఒక వ్యక్తిని చోడవరం ఎక్సైజ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చోడవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె. వి పాపనాయుడు ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా స్టేషన్ పరిధిలోని దేవరాపల్లి మండలం బేతపూడి గ్రామంలో నాటుసారా స్టావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 16 లీటర్ల నాటుసారా కలిగి ఉన్న అదే గ్రామానికి చెందిన ఉగ్గిన శివను అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకు తరలించారు.