మధ్యాహ్న భోజన పథకం కార్మికుల బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలని మధ్యాహ్నం భోజనం కార్మికులు కోరుతున్నారు. బుధవారం చోడవరంలో నియోజకవర్గ స్థాయి లీడర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో బిల్లులు విడుదల చేయకపోతే విద్యార్థులకు వంట ఎలా చేసి పెట్టాలని ఆమె ప్రశ్నించారు. ఇలా అయితే కష్టమన్నారు.