అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ జిల్లా పర్యటన భాగంగా ఆదివారం చోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంభు విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదర స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను అర్చకుడు చలపతి వివరించారు. అనంతరం కేశవస్వామి ఆలయాన్ని శివాలయాన్ని సందర్శించి స్వామివార్లను దర్శించుకున్నారు. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో చోడవరంలో వెల్కమ్ బోర్డును ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.