చోడవరం: ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు

83చూసినవారు
చోడవరం శ్రీ స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టణ పరిధిలో గల వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదల స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్