చోడవరం మండలంలోని సింహాద్రిపురం శివారు పాతిక గ్రామంలో ఆదివారం శ్రీ మహా గణపతి, శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర మూర్తి సహిత లక్ష్మీదేవి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రముఖ ఘనాపాఠి, వేద స్మార్త పండితులు శ్రీ పాకల కామేశ్వరరావు (మామిడిపల్లి) ఆధ్వర్యంలో ప్రముఖ స్మార్త పండితులు పాకల. విశ్వనాథం ఆధ్వర్యంలోప్రతిష్ట నిర్వాహణ జరిపించారు. ఈ కార్యక్రమంలో పాతిక గ్రామస్తులు, పెద్దలు పాల్గొన్నారు.