చోడవరం మండలం వెంకన్నపాలెం రహదారిలో రోడ్డు పక్కన కల్వర్టు నిర్మాణం గురించి సీపీఐతో పాటు వెంకన్నపాలెం గోవింద మాస్టారు చేసిన కృషి పోరాటం ఎట్టకేలకు ఫలితం ఇచ్చింది. ముఖ్యంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేశారు. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్న తీరుపై నిరసన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు గురువారం మధ్యాహ్నం నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనిపై ఆర్ అండ్ బి అధికారులకు సీపీఐ ధన్యవాదాలు తెలిపింది.