రావికమతం జిల్లా పరిషత్ హై స్కూల్ లో శుక్రవారం స్కూల్ యూనిఫారాలు, పుస్తకాలను స్థానిక సర్పంచ్ మంగా మొదినాయుడు, చైర్మెన్ బూసాల అప్పారావుల చేతుల మీదుగా విద్యార్థినీ, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో విద్యార్థిని, విద్యార్థులకు స్కూలు అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పారని పేర్కొన్నారు.