చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కిరణం కుమార్ సౌజన్యంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. చోడవరం తహసిల్దార్ ఏ. రామారావు, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ వి. రాజ్ భరత్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కళాశాలలో 110 మంది విద్యార్థుల ఓటర్ నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 9వ తేదీ వరకు ఉంటుందన్నారు.