చోడవరం మండలంలో గల వివిధ గ్రామాల్లో మంచినీటి పథకాలను విశాఖ జిల్లా పరిషత్ సీఈఓ పి.నారాయణమూర్తి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలో గాంధీ గ్రామం జన్నవరం వెంకన్నపాలెం గ్రామాలలో మంచినీటి పథకాలు పరిశీలించి వాటి నిర్వహణ పని తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతరం మంచినీటి సరఫరా జరగాలని, నిధులు కలుషితం లేకుండా ఎప్పటికప్పుడు తగు పరిశీలన జరపాలని సిబ్బందిని ఆదేశించారు.