మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం బంగారు మెట్టలో ఘనంగా నిర్వహించారు. యువజన నాయకుడు బైనా మణికంఠ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్ముని అహింస మార్గంలో ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ స్కూల్ చైర్మన్ పర్రి శ్రీను, వార్డ్ మెంబర్, పర్రి రాజేష్, పాతాళ మాణిక్యం, చింతల గణేష్, ఆదట్రావు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.