మలేరియా నివారణ మాస ఉత్సవాలలో భాగంగా శనివారం రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో జరిగిన ర్యాలీలో మండల ఆరోగ్య సిబ్బందితో పాటు స్టేట్ బీజేపీ కౌన్సిల్ సభ్యులు గల్లా రాజేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.