చోడవరం కొత్తూరు జంక్షన్ నుండి పి ఎస్ పేటకు వెళ్లి రహదారిని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు బుధవారం ప్రారంభించారు. ఈ సిసి రోడ్డునీ సుమారు కోటి రూపాయలులతో నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారులు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ ఆంజనేయులు, తాహసిల్దార్ రామారావు, ఈవో నారాయణ రావుతోపాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.