రావికమతం మండలం గర్నికం గ్రామంలో 16 దళిత కుటుంబాలకు 20 ఎకరాలుభూమిపై ఆధారపడి జీవిస్తున్నారని, రెవిన్యూ అధికారులు కొంతమంది పెత్తందాలతో కుమ్మక్కది వెబ్లాండ్ రికార్డులో భూములు తొలగించారని దళితులు ఆందోళన చేశారు. తక్షణమే జెసి భూములను పరిశీలించి రికార్డులో నమోదు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే గోవిందరావు, కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ మండల కార్యదర్శి సిహెచ్ సూరిబాబు కోరుతున్నారు.