గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రావికమతం ఎస్ఐ ఎం రఘువర్మ మంగళవారం సాయంత్రం తెలిపిన ప్రకారం ఏజెన్సీ ప్రాంతం నుంచి కాలినడకన గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం రావికమతం పొలిమేరలో తనిఖీలు నిర్వహించగా తమిళనాడుకు చెందిన మురుగన్, తంగం లు 8 కిలోలు గంజాయితో పట్టు బడ్డారని తెలిపారు. వీరి నుంచి గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామన్నారు. ఈ దాడుల్లో ఏ ఎస్సై అప్పలరాజు సిబ్బంది పాల్గొన్నారు.