చోడవరం నియోజవర్గ పరిధిలో గల రావికమతం మండలంలోని టి. అర్జాపురం సచివాలయం-1 లో ఖాళీగా ఉన్న డిజిటల్ అసిస్టెంట్ పోస్టు మస్తు చేయాలని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పి వి ఎస్ ఎన్ రాజు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ పంచాయతీ లోసుమారు 5,000 జనాభాతో ఒక ప్రధాన పంచాయతీగా గుర్తింపు పొందిందన్నారు.