అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చిమలపాడు పంచాయతీ పరిధిలో నేరేడు బంధ, జీలుగులోవ, కళ్యాణపు లోవా రాయిపాడు, అజయ్ పురం గ్రామంలో గల 35 మంది పిల్లలు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో అపార్ యాప్ నమోదు చేయడానికి వీలుపడడం లేదనీ వాపోతున్నారు. వారందరికీ ఖర్చుతో కూడుకున్న నోటరీ లేకుండా పుట్టిన తేదీ ధ్రువపత్రాలు జారీచేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ఆయా గ్రామాల పిల్లలు నిరసన తెలిపారు.