ప్రముఖ వ్యాపారి పెనుగొండ బంగారం 85వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం కొత్తకోట శివ కేశవ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 85మంది వృద్ధులు పారిశుధ్య కార్మికులకు రగ్గులు అక్కడికి వచ్చిన నాయకులు చేతులమీదుగా పంపిణీ చేశారు. ప్రతి ఏడాదిపుట్టినరోజు పురష్కరించుకొని ఇదే విధంగా సేవకార్యక్రమాలు చేస్తుంటారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న బంగారంను సర్పంచ్, గ్రామ నాయకులు సత్కరించారు.