చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం చినపాచిల గ్రామం వద్ద శుక్రవారం రావికమతం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తుండగా నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని రావికమతం పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లను రెండు ద్విచక్ర వాహనాలను 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లుగా తెలిపారు.