రావికమతం: గుడ్డిపలో ప్రభుత్వ భూముల అమ్మకాలు

78చూసినవారు
రావికమతం: గుడ్డిపలో ప్రభుత్వ భూముల అమ్మకాలు
రావికమతం మండల గుడ్డిప గ్రామంలో ఆదివారం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉదయం సర్వే నంబరు 44, 45 సుమారుగా 12 ఎకరాలు అక్రమంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న అక్రమ సర్వే పనులను స్థానికులు అడ్డుకొని నిరసన తెలిపారు. ప్రైవేట్ లైసెన్స్ సర్వేతో అక్రమ సర్వే చేసి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారనీ ఆరోపించారు. పేరగొట్టుపాలెం ప్రాంతంలో అత్యంత నిరుపేదలు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఎంపీటీసీ సభ్యులు గంజి సూర్యనారాయణ అన్నారు. అనేక కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్