చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సెలవులు ఆఖరి రోజు సందర్భంగా ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ తో పాటు అధ్యాపకులు అందరూ సాంప్రదాయ వస్త్రధారణ ధరించి సంక్రాంతి కార్యక్రమాలకు హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణ ధరించి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు.