ఈ నెల 12 నుండి 14 వరకు కర్నూల్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఉషు చాంపియన్ షిప్ పోటీల్లో చోడవరం గణేష్ డిఫెన్స్ అకాడమీ క్రీడాకారులు పతకాలు సాధించారు. జూనియర్ విభాగంలో 45 కేజీల క్యాటగిరి తేజ స్వరూప్ బంగారుపతకం సాధించగా, విమెన్స్ సీనియర్ విభాగములో 60 కేజీల కేటగిరిలో లావణ్య రజత పతకం, 65 కేజీల కేటగిరిలో సాయి లక్ష్మి కంచు పతకం సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ పుల్లేటి గణేష్ గురువారం తెలిపారు.