చోడవరం పంచాయతీ ఈవోగా శ్రీనివాసరావు

చోడవరం పంచాయతీ కార్య నిర్వహణ అధికారిగా కే శ్రీనివాసరావు నియామకం అయ్యారు. ఈయన సబ్బవరం పంచాయతీ నుంచి బదిలీపై చోడవరంలో చేరారు. ఇప్పటివరకు ఇక్కడ ఈవోగా పనిచేసిన నారాయణరావు రాయపురాజుపేట కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోడవరం పంచాయతీలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి, ముఖ్యంగా పారిశుద్ధ్యo త్రాగునీటి సమస్య తలత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.