నర్సీపట్నంలో గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలి
నర్సీపట్నంలో గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం చోడవరం నియోజకవర్గంలో గల జెడ్ బెన్నవరం నుండి కళ్యాణలొవ మీదుగా అజయ్ పురం వరకు గిరిజనులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ లోవ గ్రామంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగంలో ఆదివాసి గిరిజనులకు రక్షణకు అనేక చట్టాలు రూపొందించారని ఈ చట్టాలు నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు పాలకులు వర్తింప చేయలేదన్నారు.