గోవాడ షుగర్స్ నూతన ఎండిగా వెంకటేశ్వరరావు నియామకమయ్యారు. ఈయన ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ ఎండిగా పనిచేసిన బి సన్యాసినాయుడునీ విజయనగరం జిల్లా భీమ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కి బదిలీ చేశారు. ఈయన 2019 నుంచి ఇప్పటివరకు ఈయన ఫ్యాక్టరీ ఎండిగా పనిచేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నూతన ఎండి మాట్లాడుతూ ఫ్యాక్టరీలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.