విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ లో మరో 4 కోచ్ లు

19చూసినవారు
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ లో మరో 4 కోచ్ లు
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20707/20708) రైళ్లలో కోచ్ ల సంఖ్యను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. ప్రస్తుతం ఉన్న 14 ఏసీ ఛైర్‌కార్ కోచ్ లను 18కు పెంచగా, రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్లలో మార్పులేదు. ఈ మార్పు శనివారం నుంచే అమల్లోకి వస్తుంది. మరోవైపు, ముంబయి-బళ్లార్ష్, ముంబయి-చెన్నై, మైసూరు-రేణిగుంట, కొల్లాపూర్-నాగుర్ రైళ్లలో జనరల్ బోగీలు 4కు పెరగనున్నాయి. ఇది సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తుంది.

సంబంధిత పోస్ట్