గవరపాలెం చింతల అగ్రహారంలోని శ్రీకృష్ణ దేవాలయంలో జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలను నిలుపుకోవాలని లక్ష్యంగా చెట్టు భజనలు, చిటికెల భజనలు, కోలాటాలు, గరిడీలు, ఏకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళలను కొత్త తరాలకు బోధిస్తున్నట్టు భజన బృందం గురువు తెలిపారు.