అక్కయ్యపాలెంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్సింగ్ అనే యువకుడు అబిద్ నగర్ పార్క్ వెనుక భాగంలో ఓ పూరి గుడిసెలో నివాసముంటున్నాడు. ఏప్రిల్ 11న శుక్రవారం రాత్రి పార్కులో నిద్రించాడు. ఉదయం చూసే రక్తపు మడుగులో గాయాలతో కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఎవరు చేస్తున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.