అల్లూరి జిల్లా అనంతగిరి మం. జీనబాడులో విహారానికి వచ్చి ఏప్రిల్ 13న ఆదివారం సరియా జలపాతంలో గల్లంతైన ఇద్దరి యువకుల మృతదేహాలు ఈ రోజు (సోమవారం) లభ్యమయ్యాయి. విశాఖలోని పూర్ణ మార్కెట్ కు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు వచ్చారు. సాయంత్రం జలపాతం దిగుతుండగా అందులో ఇద్దరు జారిపడి, గల్లంతయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.