సీఎం రాక రేపు

57చూసినవారు
సీఎం రాక రేపు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 16వ తేదీన విశాఖ పర్యటనకు రానున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. పది నిమిషాలు ఎయిర్‌పోర్టులో గడిపిన తరువాత 10.50 గంటలకు బయలుదేరి ఆర్కే బీచ్‌రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్కు హోటల్‌ వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించి, మధ్యాహ్నం 12.05 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు.

సంబంధిత పోస్ట్