విశాఖ తూర్పు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలుపొందిన
టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబుకు తెలుగుదేశం పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆయన తన సమీప
వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణపై ఆధిక‍్యత కనబరుస్తూ వచ్చారు. చివరకు 70, 877వేల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మంగళవారం వెలగపూడిని తెలుగుదేశంపార్టీ శ్రేణులు అభినందనలతో ముంచెత్తారు.