విశాఖ షిప్ యార్డ్ లో 60 టన్నుల టగ్ నిర్మాణం ప్రారంభం

66చూసినవారు
విశాఖ షిప్ యార్డ్ లో 60 టన్నుల టగ్ నిర్మాణం ప్రారంభం
హిందుస్థాన్ షిప్ యార్డ్ లో 60 టన్నుల ఫుల్ టగ్ నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోర్ట్ ఛైర్మన్ ఏ. అంగమత్తు పూజలు నిర్వహించారు. ఈ టగ్ నిర్మాణ బాధ్యతను పోర్ట్ షిప్ యార్డ్ కు అప్పగించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నౌకను గడువు లోపు నాణ్యతతో పూర్తిచేస్తామని షిప్ యార్డ్ ఛైర్మన్ హేమంత్ కత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్