దేవరాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడిగా పెద్దాడ వెంకటరమణ ఎన్నికయ్యారు. బుధవారం దేవరాపల్లిలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వెంకటరమణను ఎన్నుకున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని కొత్త అధ్యక్షుడు తెలిపారు. ఎన్నిక కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గం పరిశీలకులు ఏసుబాబు, పార్టీ నేత కిలపర్తి భాస్కరరావు పాల్గొన్నారు.