సింహాచలం పంచ గ్రామాల భూముల సమస్యలపై గ్రామస్తులు ఆదివారం ఉదయం ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం నుంచి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని పంచగ్రామాల భూముల కమిటీ సెక్రటరీ కృష్ణం రాజు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు.